కనరే ఈశుని ప్రతిరూపం…
నిజమనిపించే తీరున శివరూపం…
అనరే శంభుని శుభ నామం…
పరమిచ్చే వరదుని ఓంకారం…
కళకళలాడుతూ కరుణామయుడు…
మన కలలను తీర్చగ తానున్నాడు…!!క!!
తరతమ భేదాలు ఉండవు తనకు…
భక్తిగ కొలిచే భక్తులు ప్రియమే తనకు….
వేదన చెందే దీనుల కొరకు…
కైలాసమునైనా వీడును కడకు…
మనలో నింపును స్థైర్యమును…
నేనున్నాననుచూ ఒక ధైర్యమును…!!క!!
నమ్మితివంటే శంకరుని…
నీ బాధ్యత నాదను ఠక్కుమని…
కొలిచితివంటే ఈశ్వరుని…
చేయిమ్మని అడుగును నడిపిస్తునని….
ఊహకు అందదు తన కరుణ…
కరుణిస్తే ఈశుడు…శరణనినా…!!క!!
పాహిమాం… పాహిమాం పరమేశ్వర పాహిమాం…. రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…