పీల్చగలనా శ్వాసని…
పరమేశ్వరా…నేనుంచగలనా ధ్యాసని…
నీ దయ లేకున్న ఏ పని మీదైననూ ధ్యాసుంచగలనా…
నీ కృప లేకున్న బ్రతుకు బండిని నడిపించగలనా….
అనుక్షణము కావాలి నీ అండ దండ…
నేను అర్పింతు శంకరా నీకు మారేడు దండ….!!పీ!!
తపోసంపన్నుడను నేను కాకున్ననూ….
అపర భక్తుడను నేను అవకున్ననూ…
వలసినంతా భక్తి నా నరనరాలలో ఉన్నది….
గోరంత నీ కరుణలో సగమిస్తే నా మనసు చాలంటువున్నది…
ప్రారబ్ద కర్మలతో ముడిపెట్టకోయి….
శంకరా… దయ చూపకుండా స్తబ్దుగా ఉండకోయి..!!పీ!!
జీవనదిలా నన్ను నీ స్మరణ చేయని…
పరమ యోగిగా పంచాక్షరీ మంత్రాలు చదవని….
కడలి పొంగునై నీ పాద పద్మాలు కడగనీ…
గంగ ధారనై నీ జటమందు నను జాలువారనీ….
మహా ప్రభో…మహిమాన్విత రూపా …
పొందని నన్ను ఏదేని వరము…
ఓ మహాదేవా….ఓ మహాశివా…..
నేను తగనపుడు నాకెందుకీ జన్మము…..!!పీ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..