పాహి పరమేశా…అభివందనం…
మాం పాహి జగదీశా శిరసాభివందనం….
రక్ష జగదీశా నా మనసు అర్పణం…
రక్ష రక్షా జగదీశా నీదే ఈ ప్రాణం…
ఫాలనేత్రా…అందుకో పాలు తేనియల సేవలు…
మేరునిభగాత్రా.. మమ్మాదుకో ప్రతి రేయిపవలు…!!పాహి!!
పొందేరు ఎల్లరూ పుణ్య సంపదలు…
వారు పలుకుచూ నమః శివాయ మంత్రాలు…
కొలుతురే ప్రాణమని నిన్ను ఆ జనులు…
నీ ముందు నిలుచుకొని శరణననుచు ఆ దీన జనులు…
ఇచ్చేవు దీవెనలు దర్శించు వారికి…
నీవు స్థితి గతులు చూడకనే ప్రతి ఒకరికీ ….!!పాహి!!
పండ్లు ఫలములతో వచ్చినా ఆదరించేవు…
గంగ జలములతో వచ్చినా చేరదీసేవు…
బిల్వ దళములతో వచ్చినా స్వాగతించేవు….
కడకు విబూది నిచ్చినా నిరాశ చెందవు…..
ఆ నిరాడంబరమే నీ సౌందర్యము…
ఆ సౌందర్యమే మాకిచ్చు అమరత్వము…!!పాహి!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం.. రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…