ఓ ఈశా…పాహి మహేశా…

ఓ ఈశా…పాహి మహేశా…
పరమేశా…దీనుల ఆశా…
ఏమని తెలిపెద నీ మహిమా…
పలు లోకాలేలే జంగమ…
భానుని సృష్టించావు…
ఇల వెలుగులు పూయించావు….
సోముని మాకిచ్చావు…
సిరి వెన్నెల నందించావు..!! ఓ!!

కావలసినవన్నీ ఇచ్చావు…
ఇంకా ఇవ్వగ ఇలపై వెలిశావు…
కోరినవన్నీ తీర్చేవు..
కొన ఊపిరిదాకా ఉండేవు…
నీ సరి దైవం ఎవరయ్యా…
ఓ శంకర..నిను గను వరమీవయ్యా…!! ఓ!!

లోటే ఉండదు నీ దయలో…
పొరపాటే ఉండదు నీ పాలనలో…
కొరతే ఉండదు నీ కృపలో…
ఇసుమంతైనా నీ కనుసన్నలలో…
నీ కరుణే ధరణికి ఆధారం..
నీ స్మరణే మా తొలి ప్రాధాన్యం…!!ఓ!!

పాహీ… పాహీ..పరమేశా… మాం పాహీ జగదీశా…రక్షా..రక్షా మల్లేశా…నీదే కద మా తొలి శ్వాస….

Leave a Comment

Scroll to Top