నారాయణుని రూపం…

నారాయణుని రూపం…
శంకరుని హృదయం…
ఈశ్వరుని రూపం…
మాధవుని మానసం…
ఆదిదేవుల ఆత్మలొక్కటే మానవా…
ఇద్దరొకటను సత్యము తెలుసుకొనకొంటివా…!!నా!!

ధ్యానించితే కేశవుని శివుడు హర్షించు…
ప్రార్ధించితే ఈశ్వరుని శ్రీ లక్ష్మిపతి సంతసించు…
తెలుసుకొనిన శివ కేశవులు ఒకటేనని….
చూడ గలవు హరిహరుల అంతరంగములని…!!నా!!

సృష్టి సంరక్షణ కొరకు నారాయణుండు…
 ముక్తి నొసగుట కొరకు శంకరుండు…
పాటుపడురిద్దరూ పగలు రాత్రనక…
కరుణించుచుందురు  కష్టమనక….
తెలుసుకుంటే నీవు ఆ నగ్న సత్యము…
కొలిచేవు ఇద్దరినీ ఇది తథ్యము…!!నా!!

పాహిమాం… పాహిమాం…శివ కేశవాయా శివా పాహిమాం…
రక్షమాం…రక్షమాం.. హరిహర రాయ రక్షమాం…

Leave a Comment

Scroll to Top