దర్శించుకున్నాను నిను నేడు ధవళేశ్వరా…

దర్శించుకున్నాను నిను నేడు ధవళేశ్వరా…
భక్తితో దారుకావన శివా…నాగేశ్వరా…
దూరమెంతనుచు నే చూడనయ్యా…
నీ పిలుపందితే వేడుకొన తిరిగొస్తు నయ్యా…!! ద!!

చేయించుకుంటివి అభిషేకములను గంగ జలముల తోటి…
పూజ చేయించుకొంటివి నాచేత బిల్వ దళముల తోటి…
నారికేళమునర్పించితిని నాగేశ్వరా…
నా లోకమే నువ్వమని కోరితిని పరమేశ్వరా…!! ద!!

వాన మబ్బులు మురిసి చినుకులిడవంగ…
పరవశము చెందినది నిను తడిపి గంగ…
గంగ స్నానాలాడితివి కదా గరళకంఠా…
నీలి మబ్బుల కింద తృప్తిగా ఓ నీలకంఠా…
ఆత్మానందము కలిగే నిను కనిన క్షణమున….
పరమాత్మా…ఇక వరములిమ్మమని నిన్ను అడగగలనా…!! ద!!

పాహిమాం..పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top