గంగాధరా…ప్రభో శివశంకరా….
గౌరీవరా…మహా కాళేశ్వరా…
తరలొచ్చునేమో సురులెల్ల కీర్తించు కొరకు….
కదలి వచ్చునేమో జనులెల్ల వేడుకొన కొరకు…
దొరకునా ఇటువంటి దర్శనము తమకని….
కలుగునా భాగ్యమ్ము మరునాటికని అని….
శివా…మరుజన్మ ఉండునా నిను కనిన పిదప….
హరా…ఇపుడైన తాకనీ నీ గర్భగుడి గడప….!!గంగా!!
నిర్మలమైన మనసుతో పూజించ వస్తిమి…
భక్తి పరిమళములతో నిన్ను ప్రార్థించ వస్తిమి…
అకుంఠిత దీక్షతో ఆచమనము చేస్తిమి…
వినయపూర్వకముగా విరులనుంచితిమి…
స్వీకరించయ్య సేవలను శంభోహరా…
ఆదుకొనవయ్య దీనులను కరుణాకర…!!గంగా!!
పూలు ఫలములను నీకు ఎన్ని అర్పించినా…
నమకచమకములు పలుమార్లు వినిపించినా…
నీ దయలేనిదే గత జన్మ పాపాలు తొలగునా….
నీ కృప లేనిదే మా బ్రతుకు క్షణమైన గడిచునా…
ఈశ్వరా…నీ పాద సన్నిధిన నేనుండి పోతురా…
నీవు కరుణిస్తే అట్లాగే నే రాలి పోతురా…
!!గంగా!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…