కైలాస గిరి నివాసా…

కైలాస గిరి నివాసా…
నా తండ్రి పార్వతీ మది నివాసా…
శరణంటి శాంకరీశా…
నీ పదమంటనీ హిమ గిరీశా…
అజ్ఞాన చీకట్లు అలముకున్నాయి…
భక్తి భావనలు నాలోన పెరగకున్నాయి…!!హే!!

కలగకున్నది నీపైన ఏకాగ్రత…
బ్రహ్మ ఎట్లు వ్రాసేనో శివా నా నుదుటి రాత…
పెట్టకున్నది మనసు నీ పైన ధ్యాస….
జన్మ ఏనాడు చేసేనో కర్మలను మహేశా…
కరుణామయునివని జనులు నిన్నందురే…
అందుకే నిలిచాను కరుణించమని నీ ముందరే…!!హే!!

వదల లేకుంటి నేను బంధాలను…
శివా…వీడలేకుంటి రాగ ద్వేషాలను…
చావకున్నది ఆశ ఏదానిపైననూ…
శివా..ఇంకెట్లు జరిపేది నీ పూజ క్రతువును…
చరణాలపై పడి వేడుకొనుచుంటి..
శివా…నీ వైపు నా దృష్టి మళ్ళించమంటి…!!హే!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం

Leave a Comment

Scroll to Top