అంతటా నీవేనటా…
శంకరా… జగమంతటా నీవేనట…
సర్వమూ నీవేనటా…
ఈశ్వరా… సమస్తమూ నీవే నట…
మహితాత్ముడివి నీవు నీలకంఠ…
మహా మహిమాన్వితుడవు నీవు గరళకంఠా…!!అంతటా!!
మాదన్నదేముంది ఈ సృష్టిలో….
నీదన్నదేవుంది ప్రతి అణువులో…
మాకున్నదేముంది ఈ పుడమిలో…
నీదన్న గుడి ఉంది ప్రతి ఊరిలో…
నిటలాక్షా… వ్యాపించి ఉన్నావు విశ్వమంతా…
అసమాక్షా… కాపాడుచున్నావు సృష్టినంతా…!!అంతటా!!
కాలమును నడిపించు వాడివి…
మా కర్మలను తప్పించు వాడివి…
ఋతువులను అందించు వాడివి…
మా బ్రతుకులను శాసించు వాడివి..
శాంకరీశా…వేచి ఉన్నాము నీ కరుణకు…
పార్వతీశా… పుష్పించ నున్నాము నీ పూజకు…!!అంతటా!!
పాహిమాం పాహిమాం పార్వతీశా పాహిమాం… రక్షమాం రక్షమాం శాంకరీశ రక్షమాం…