కలగనని వరమిది…
కనులకింపైన దర్శనంబిది….
శంకరా…ఏ పూర్వ పుణ్యమిది…
కరుణించిన నీ మనసు బహు గొప్పది….
అవ్యాజమైన నీ ప్రేమను ఏమనను శంకరా…
అనూహ్యముగ స్పందించు నీ కరుణనే మనుచు పొగడరా…!! క!!
ఇతోధికముగ నుండు మా పూజలు…
అత్యధికముగ నుండు నీ వరములు…
సాధారణముగా వుండు మా సేవలు….
అసాధారణముగా వుండు నీ లీలలు….
హే మహేశా… మనసు పరవశించినది నీ ప్రేమకు…
ఉమా మహేశా…శిరము వంచనున్నది నీ కరుణకు….!! క!!
అసంఖ్యాకములు నీ మహిమలు….
అనిర్వచనీయములు నీ మాయలు…
అద్భుతముగ నుండు నీ స్మరణలు…
ఆధ్యాత్మికత నొందు మా మనసులు…
హే శంకరా…పవిత్రముగ చేసేను నీ పూజను….
పరమేశ్వరా… సంపూర్తిగా ఆర్పిస్తు నా జన్మను….!! క!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…