ఓం హరా శంకరా….
వందనం దిగంబరా…
ప్రళయ కాల భీకరా…
ప్రణవ నాద శుభకర…
కరుణ చూపి కావుమయ్య పార్వతి పరమేశ్వరా….
తప్పు కాచి బ్రోవుమయ్య త్రిపురాసుర సంహార….!!ఓం!!
శివా…సంహరించు మా దుష్ట గుణములు….
ఓ శివా…ప్రసాదించు సత్కర్మ ఫలములు….
హరా…రూపుమాపు మా లోని స్వార్థము…
ఓ హరా ..అనక రేపు కలిగించు భాగ్యము….
హరోం హరా…హరోం హరా…గంగా గౌరీశ్వరా….
ఓం శివోం హరా..శుభంకరా..కరుణించరా దేవరా…!!ఓం!!
శివా…పలుక నివ్వు నీ స్తోత్ర నామము…
ఓ శివా…ప్రాప్తమివ్వు అర్పించ బిల్వము ….
హరా… చేయనివ్వు క్షీరాభిషేకము…
ఓ హరా… చూడనివ్వు కైలాస శిఖరము…
హరోం హరా…హరోం హరా…శంభో హర శంకరా…
ఓం శివోం హరా దయాకర…దయ చూడుము శంకరా…!!ఓం!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…