సోమేశ్వరా..నిను పొగడ కష్టమంటి…

సోమేశ్వరా..నిను పొగడ కష్టమంటి…
నాగ చంద్రేశ్వరా…కీర్తింప ఎవరి తరమంటి…
పరమేశ్వరా…నీ ప్రేమ అసమానమంటి…
మహా కాళేశ్వరా…నీ కరుణ అమోఘమంటి…
దయా గుణ శీలా దండాలు చాలవంటి…
పొర్లు దండాలు పెట్టినా నీకు తక్కువంటి…!!సో!!

చూపు నిచ్చావు తండ్రి.. నిను చూచు చుంటి….
కరములిచ్చావు తండ్రీ…నిను కొలుచుచుంటి….
నడక నేర్పావు తండ్రీ… గుడికి వస్తుంటి….
మాట నేర్పావు తండ్రి…శివ శివా అనుచుంటి…
ఇన్ని ఇచ్చిన ముక్కంటి నన్నేమేడగవేంటి…
రెండు బిల్వ దళములకు మురిసేవు ఈ వింత ఏంటి…!!సో!!

మనసు నిచ్చావు వేదనను మాన్పవేంటి…?
జన్మనిచ్చావు సద్ధతిని చూపవేంటి…?
కర్మలు ఎన్ని మిగిలున్నాయో చెప్పవేంటి…?
తప్పులను సరిదిద్దుకొను దారి చూపవేంటి…?
మౌనముగ నువ్వుంటే మాకు దిక్కెవరంటి…?
శరణంటూ చరణాల శిర మొంచి పడనుంటి…!! సో!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం..

Leave a Comment

Scroll to Top