పిలిచిన పలికే శంభుడా..

పిలిచిన పలికే శంభుడా..
వరమడిగిన ఇచ్చే దేవుడా…
శ్లోకాలను పలికెద ఈశుడా…
శోకాలను తుడువుము సాంబడ…
ఇది వేదన తోటి నివేదన…
మన్నించుము మనవిని త్రిలోచన…!! పి!!

తెచ్చేనయ్యా కుసుమాలు…
గంగతో కడిగేనయ్యా పాదాలు…
చేసేనయ్యా అభిషేకం…
ఇక నీవే శంకర మా లోకం…
జయములనిచ్చే జంగమా…
నిను పూజించి తరియించమా…!! పి!!

కోరేవయ్యా బిల్వమును…
నువ్వడిగేవయ్యా భస్మమును…
పిలిచేవయ్యా భక్తులను…
వరమొందగ రమ్మని దీనులను…
ఓం నమో నమో పరమేశ్వరా…
నిను వినా మాకు దిక్కెవరురా…!! పి!!

పాహి..పాహి పరమేశా… మాం పాహి పాహి జగదీశా…రక్ష రక్ష సర్వేశా…శివ రక్ష రక్ష గౌరీశా….

Leave a Comment

Scroll to Top