గణానథా నీ పండుగను…

గణానథా నీ పండుగను…
ఘనముగా జరిపామయ్యా మేము…
శివపుత్రా నీ వేడుకను…
చూసిన జన్మలకవ్వు ఒక వరము…
శివ శివ శివ శివ గణనాథా…
శివ శంభో శంకరా గణనాథా..!!గణ!!

వేశామయ్యా పందిళ్ళు…
ఆపై తీశామయ్యా గుంజిళ్ళు…
పంచామయ్యా గుగ్గిళ్ళు…
నీకుంచీ బోలెడు ఉండ్రాళ్ళు…
శివ శివ శివ శివ గణనాథా…!!గణ!!

తెచ్చామయ్యా పుష్పాలు…
జరిపించామయ్యా పూజలు…
చేయించామయ్యా లడ్డూలు…
మ్రోగించామయ్యా మేళాలు…
శివ శివ శివ శివ గణనాథా…
మా మొరలను విని దయ కనరాదా..!!గణ!!

పాహి పాహి గణనాథా…మాం పాహి పాహి గణనాథా….

Leave a Comment

Scroll to Top