కైలాసము నందున్న సిద్ధి గణపతి…

కైలాసము నందున్న సిద్ధి గణపతి…
నువ్వు కులాసాగా ఉండాలయ్య బొజ్జ గణపతి….
భూలోకమున చేసాము చవితి పండుగ…
మేము చేసాము నీ పండుగ భలే జోరుగా…
గణ గణాగణపతి… గంగాధర గణపతి…
గుణసుగుణ గణపతి గౌరీ సుత గణపతి…!! కైలాస!!

వినాలయ్య వినతులను పెద్ద చెవులతో…
నువ్వు కనాలయ్య మా వైపు సూక్ష్మ కనులతో…
నీవే రా గణపతి మా తొలి పూజల దేవుడు…
నువ్వు దీవించరా గణపతి మమ్ము ఎప్పుడు…
గణ గణ గణపతి గంగాధర గణపతి…
గుణా సుగుణ  గణపతి గౌరీ సుత గణపతి…!! కైలాస!!

పార్వతమ్మ పెంపకాన పెరిగినోడివి…
శివ శంకరుని నీడలోన ఎదిగినోడివి…
నీ జననీ జనకులే నీకు లోకమంటివి….
నీవు ప్రదక్షిణము చేసి మాకు దైవమైతివి…
గణ గణా గణపతి…గంగాధర గణపతి…
గుణా సుగుణ గణపతి గౌరీ సుత గణపతి…!!కైలాస!!

గణేశాయ…గణేశాయ..సిద్ధి గణపతి…
ప్రభో మహాకాయా లంబోదర…బొజ్జ గణపతి…

Leave a Comment

Scroll to Top