శివా…ఒక్కటైనా అందెనా నా మనసు చేసిన పూజలు…

శివా…ఒక్కటైనా అందెనా నా మనసు చేసిన పూజలు…
హరా… నీకవి అందకుంటే తప్పు నాదే మన్నించమనే ఈ కరములు….
మనో నిష్టతో చేతునయ్యా మరల మరలా పూజలు…
మనసును తాకినపుడే ఇవ్వవయ్యా నీకు తోచిన ఫలములు…!!ఒక్క!!

ఒక కొమ్మనడిగితి ఇమ్మని….
పూబాల గుత్తుల రెమ్మని….
ఆ గంగ తల్లిని అడిగితి…
చెంబుడు గంగ జలముల నిమ్మని…
తీసుకొచ్చి చేతునయ్యా భక్తితో నీ పూజను….
శ్వాసను ఒడిసిపట్టీ పిలుతునయ్యా శంకరా…నీ పిలుపును….!!ఒక్క!!

గుడి గడప చెంతకు వచ్చితి…
రానివ్వవయ్యా పశుపతి…
నువ్విస్తివంటే ఆ ఆనతి…
నేనిచ్చుకుందును హారతి….
కన్నులారా చూసుకుంటూ చెప్పుకొందును స్తోత్రము…
నీ పాదముల కడ చేరుకుంటూ కను మూయుటన్నది లక్ష్యము…!!ఒక్క!!

పాహిమాం…పాహిమాం…పార్వతీ పరమేశ్వరా….రక్ష మాం…రక్షమాం…శంభో హర శంకరా…

Leave a Comment

Scroll to Top