పలుకరా ఓంకారము…
భక్తి మీరా శివుని ప్రియనాదము…
వ్రాయరా…ఓంకారము…
హరుడు చుట్టేను నీ బ్రతుకుకు శ్రీకారము…
అప్పుడే మొదలవును నీ జీవితం…
నువ్వప్పుడే మమైకమవు, నీ దౌను పుణ్యచరితం…!!ప!!
శివునితో ఏర్పరచుకో అనుబంధము…
ఆ హరునితో పెంచుకో భక్త్యానురాగము….
తెలుసుకొనగలడు శివుడు నీ హృదయ స్పందనలు….
తక్షణము స్పందించు హరుడు తీర్చ నీ మనోవేదనలు….
నీ బాధ నాదనును శంకరుడు కలలోకి వచ్చి…
ఇవి కల కాలముండవు కలత చెందొద్దని ఊరడించు నిద్రపుచ్చి…!!ప!!
నమ్మరా… నిటలాక్షుడు నీ వాడే ఎపుడూ…
తనని కొలిచితే కనురెప్ప కానుండు నతడు….
నీ గుండెపై చెయ్యేసి మాటివ్వు శివునికి….
నీ నామ స్మరణని ఆపనని గట్టిగా చెప్పేయి హరునికి…
ఇక నీ భారమంతా మోసేను ఆ సాంబశివుడు…
రవ్వంత కష్టమొచ్చినా నీ కొరకు పరితపించును హరుడు…!!ప!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం…. రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం…