గోవింద గోపాల నారాయణ…
అరవింద నేత్రాల మధుసూధన..
మా తల్లి శ్రీలక్ష్మి హృదయాసనా…
మాకు మోక్షాల నీవయ్యా యదు భూషణ…
నారాయణం భజే నారాయణం…
శ్రీమన్నారాయణం హరే నారాయణం…!! గో!!
దుష్టులను శిక్షించుటే నీ లక్ష్యము..
ఆర్తులను రక్షించుట నీ ధ్యేయము…
ధర్మమును నిలుపుటే నీ కర్తవ్యము….
అధర్మము పీచమణుచుటకే నీ అవతారము…
మాధవా… కలికాల పోకడల రాక్షసుల నుండి…
జగములను కాపాడి రక్షించరా వైకుంఠపురము నుండి…!!గో!!
గజేంద్రుని మొరవిని పరుగు తీశావు…
సిరుల తల్లికీ చెప్పక తరలి తనని కాచావు…
అవలీలగా ఎత్తావు గోవర్ధన పర్వతాన్ని…
అర క్షణమైనా ఆలసించక ఆదుకుంటివి గోకులాన్ని…
పాలకడలీ శయన మధుసూదనా…
పారిజాతముల పూజ నీకు సరిపోవునా…!!గో!!
పాహిమాం పాహిమాం నారాయణ పాహిమం… రక్షమాం… రక్షమాం…. శ్రీమన్నారాయణణా.. రక్షమాం..