సుమమునవనీవయ్యా శివ శంకరా…

సుమమునవనీవయ్యా శివ శంకరా…
గంగ జల ధారనవనివ్వు పరమేశ్వరా…
శూలమవనీవయ్య శంభో హర…
కాలి గజ్జెనవనీవయ్య గంగాధరా..
వరమివ్వు వరమివ్వు గౌరీపతి…
నీ పద ధూళినవునటుల కాశీపతి…!!సుమ!!

వినిపించనా శివా…వేల స్తోత్రాలు…
జరిపించనా శివా…లక్ష అభిషేకాలు…
చేయించనా శివా..గంగ స్నానాలు…
పూయించనా  శివా… విభూది పూతలు…
వరమివ్వు వరమివ్వు గౌరీ పతి…
మెడన రుద్రాక్షనవనివ్వు కాశీపతీ..!!సుమ!!

విరచింతురా శివా…నీదు గీతాలు…
వల్లింతురా శివా…నీదు మంత్రాలు..
పూజింతురా శివా..నీ పాద పద్మాలు..
అర్పింతురా శివా…మనసు కుసుమాలు…
వరమివ్వు వరమివ్వు గౌరీ పతి…
నీ చరణాల పడనివ్వు కాశీ పతి…!!సుమము!!

పాహిమా పాహిమాం పరమేశ్వరా .. శివా రక్షమామ్ రక్షమాం సర్వేశ్వరా…

Leave a Comment

Scroll to Top