వేడుకొన రారండి శివపుత్రుని…

వేడుకొన రారండి శివపుత్రుని…
మనసారా పూజించరారండి గణనాథుని…
తెలుపుకొన రారండి మీ వినతిని…
భక్తితో కొలవంగ రారండి గజముఖుడిని…!!వే!!

విఘ్నాలకు అధిపతి మన గణపతి…
అతని కరుణున్న తోడుండు గౌరీపతి..
సంపదలు సమకూర్చు శ్రీ గణపతి…
విజ్ఞాన వనరులను వనకూర్చు వర గణపతి!!వే!!

గణములకు అధిపతి మన గణపతి….
సకల గుణ సంపన్న శోభితుడు శివగణపతి….
ముద్దు బాలుడు ఉమకి ప్రియ గణపతి…
మొదటి పూజితుడు జగమునకు జయ గణపతి…!!వే!!

పాహిమాం పాహిమాం గణేశాయ పాహిమాం… రక్షమాం రక్షమాం గౌరీ కుమారా రక్షమాం…

Leave a Comment

Scroll to Top