ఉమాదేవి పుత్రుడా… విఘ్నేశ్వరుడా…
నిన్ను సదా మేము కొలుతుమయా నమ్ము దేవుడా…
కార్తికేయ సోదరుడా… మహాకాయుడా…
కనుల పండగయ్య నిన్ను చూస్తే శ్రీ గణేశుడా…!!ఉమా!!
సింధూర వర్ణ గణేశా.. మా పూజలందుకో…
బంగారు మేని గణేశా.. ఉండ్రాళ్లనందుకో…
నిన్ను కొలుచుటంటే మాకెంతో ఇష్టమంటిమి…
దయ తలచివంటే నీవే మా దైవమంటిమి…!!ఉమా!!
కాణిపాక గణపతి కదలి రావయా…
తల్లి కాత్యాయనిని తోడ్కోని తరలి రావయా…
శ్రీశైలం సాక్షి గణపతి లేచి రావయా…
ఆ మల్లన్నను పిలుచుకొని వేగ కదలి రావయ్యా…
కార్తికేయుడున్నాడు వేచి ఇక్కడ…
మీరోస్తిరంటే తిరనాళ్ళే చేతుమిక్కడ…!!ఉమా!!
గణేశా..గణేశా రార గణేశా…
మమ్ము దీవించగ రారయ్య మహా గణేశా…