జననీ జనకులు మీరే…
జగముల తల్లియు తండ్రియు మీరే…
సృష్టికి మూలం మీరే…
పునః సృష్టికి ప్రాణం మీరే…
నమో నమామి గౌరీశా…
సదా స్మరామి పరమేశా…!!జననీ!!
ఉచ్చ్వాసం నీవే శంకరా…
నిశ్వాసం నీవే శాంకరీ…
మా మనసే నీదిర ఈశ్వరా…
మా హృదయం నీదే భ్రామరీ…
ముడి పడి వుంది మా జన్మ మీ చల్లని కన్నుల చూపులతో…
ఋణపడివుంది మా ప్రాణం ఏ నాటికి తీరని బంధముతో…!!జననీ!!
ఒకరంటే ఒకరికి ప్రాణమై…
మీరిద్దరు ఒకటే దేహమై..
కరుణించే మన సులు ఒక్కటై…
దీవిస్తుంటే బహు ముచ్చటై…
వెంటనే మము విడిపోవా గత జన్మల తాలూకు కర్మలు…
వెనువెంటనే పరుగిడి రావా మీ వరముల వెల్లువ సిరులు…!!జననీ!!
పాహి పాహి జగదీశా…మాం పాహి పాహి గౌరీశా…