శివనామస్మరణయే శ్రీరామరక్ష…

శివనామస్మరణయే శ్రీరామరక్ష…
హరుని పారాయణ ప్రక్రియే సర్వ జగద్రక్ష…
స్మరియించిన జన్మలవును శివుని పాద సుమములు…
తనని ప్రార్థించిన మనసులవును హరునికి ఇష్ట భక్తులు….!!శివ!!

నమ్మిరంటే శివునిని ఇక భారమంత అతనిదే…
రక్షించమంటే హరునిని  క్షణాన వాలు నిజమిదే…
పరితపించు హృదయానికి నిజరూపం శివుడు….
నీకై తపన పడే సుగుణానికి నిదర్శనం రా..హరుడు…
మానకోయి… శివుని నామ స్మరణనెన్నడూ…
నువ్వు ఆపకోయి…హరుని పూజ సేవలెన్నడూ…!!శివ!!

ధ్యానముద్రలో ఉన్నా శివుడు నిన్ను మరువడు….
తాను యోగ నిద్రలోనున్నా  నీ చేయి విడవడు….
ఒక్కసారి చేరిపోతే  శివుని మనసులో…
నిన్ను కంటి పాప లాగ కాచు అన్ని వేళలో….
అందుకే మానకోయి… శివుని నామ స్మరణనెన్నడు…
నువ్వు ఆపకోయి హరుని పాద పూజలెప్పుడూ…!!శివ!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…

Leave a Comment

Scroll to Top