మునుపటిలా లేనయ్య మాహేశ్వరా…
ఇప్పటి నన్ను తలుచుకుంటే నేను జగదీశ్వరా…
ఎప్పుడు ఎలా మార్చావో ఈ జన్మను…
సదా వీడనంటుంది శివా..నీ స్మరణను…
నీ ధ్యాసలే తనకు ఊసులాయే…
శివా… నీ తలపులే తనకు ఊపిరాయే…!!మునుపటి!!
అదిగదిగో నీ రూపు నను మాయచేసే….
ఇదిగిదిగో నీ కనులు నను చేరదీసే…
ఇక వెళ్ళగలనా శంకరా…నీ పదము లీడి…
వెళ్లి వుండ గలనా శంకరా…నీ ఎదుట నుండి…
ఫణి భూషణా…పాదాలు కడగనీవయ్య….
శశి ధారణా…ఆ జలము చల్లుకో నీవయ్య…!!మునుపటి!!
ఓంకార నాదమే నా గానమవ్వని…
నీతోటి బంధమే నా ప్రాణమవ్వని…
పలికించు నా నోట శంకరాభరణం…
చేయించు నా చేత నీ విభూతి ధారణం…
గౌరీపతి… నన్ను నీ ప్రియ భక్తుడిని కానివ్వుమయ్యా…
ఉమాపతి… పది తలల రావణుని మించి భక్తి కలిగి ఉండనీవయ్యా…!!మునుపటి!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర… రక్షమాం రక్షమాం సర్వేశ్వర…