అందుకో శంకరా.. అభివందనం…

అందుకో శంకరా.. అభివందనం…
శివా..పుచ్చుకో మా నుండి నీరాజనం…
చేసుకో మా మదిని సింహాసనం…
చేరి పోవయ్య వేసుకొని పద్మాసనం…
రాజాధిరాజా రాజ మార్తాండా…
నీవే కదా శివ మా అండదండ…!! అందుకో!!

పరమ నీతిజ్ఞుడివి  నీవు పరమేశ్వరా…
నీ పరిపాలనలో మాకు లోటుండునా…
ధర్మరక్షకుడికివి నీవు జగదీశ్వరా…
ఈ భువిన అధర్మమునకు చోటుండునా…
శాంతి సౌఖ్యాల విరులు పూయనిస్తూ….
పాలించెదవు నీవు మమ్ము దీవిస్తూ…!! అందుకో!!

శంకరా.. సృష్టి సంరక్షకుడివి నీవు సర్వేశ్వరా…
కాల చక్రము కదలక తానుండునా…
లోక రక్షకుడివి నీవు లోకేశ్వరా…
పంచభూతములు నీ మాట జవదాటునా…
మనుగడికి మూలమై దయ చూతువు…
మా మనుగడే ప్రశ్నార్ధకమైతే నీవు కరుణింతువు…!! అందుకో!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమామ్…

Leave a Comment

Scroll to Top