ప్రణామములు.. నీకు పార్వతీ ప్రియ నందన…

ప్రణామములు.. నీకు పార్వతీ ప్రియ నందన…
సదా పత్రి పూజలు చేతుము శివ గజనాన…
ఆశీస్సులీవయ్య గణనాయక….
శుభాశీస్సులీవయ్య శుభదాయక…!!ప్ర!!

ఆత్మానందమౌను నీ పూజలు…
అంతర్ధానమౌను మా చిక్కులు…
అసమాన తేజములు నీ చూపులు…
అదృశ్యమయ్యేను దుష్కర్మలు….
గణపతీ…గరిక పూజలు నీకు ఏ పాటివయ్యా…
సిద్ధి గణపతీ…. నేనే అడుగు వేసిన నీ అండ ఉండవలనయ్యా….!!ప్ర!!

మొదలెడత నిను  కొలిచి కార్యాలని….
ధైర్యంగా ఎదురిస్త నిను తలచి విఘ్నాలని…
చేపడత నీ చవితి వ్రత పూజని…
వ్రాసి చూపెడత  భక్తితో గీతాలని…
గణపతీ… గంగాధరుని వరమొంది  దైవమైనావు…
విఘ్న గణపతీ… విశ్వ ప్రఖ్యాతి చెంది నీ ఉనికిని చాటుకున్నావు…!! ప్ర!!

పాహిమాం పాహిమాం సిద్ధి వినాయక పాహిమాం రక్షమాం రక్షమాం వీర వినాయక రక్ష మాం…

Leave a Comment

Scroll to Top