అహో నీలకంఠ…
పండెరా మా బంగారు కలల పంట..
కంటిరా ముక్కంటి సుందరముగా…
పండెరా మా బంగారు కలల పంట..
కంటిరా ముక్కంటి సుందరముగా…
రమ్మంటిరా నా మదికి సాదరముగా…
శివోహం.. శివోహం.. మనసాస్మరామి…
ప్రతి శుభోదయం నీ వరం శిరసాం నమామి…!! అహో!!
ఈశ్వరా…నీ దరహాస చంద్రికలు కంటిరా…
పరమేశ్వరా… నీ నయనవీచికలు మా మనసులను తాకెర….
తెలియనీయకు మాకు కాలాన్ని కూడా….
గురుతు చేయకు బంధాల వెంట పడకుండా….
మేము పరుగు తీసే రోజు ఆగిపోయింది….
నీ వైపు అడుగులేసే రోజు ముంచుకొస్తోంది…!!అహో!!
కాననున్నవి విలువలు ఈ జగాన…
మమతలు తరుగుతున్నవి ఎందుకో ఈ సమాజాన…
నడవకున్నది లోకము ధర్మ మార్గాన…
తన తప్పు తెలియకున్నది ఇంకనూ వసివాడినా…
మౌన ప్రార్థనల నివేదనలు వినుమయ్య శంకరా…
సత్య, ధర్మములకు ఊపిరవుమయ్య ఈశ్వరా…!! అహో!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…