శిఖిపింఛ మౌళీ….
హే…గోపికా హృదయకేళీ…
కృష్ణా…అందుకో మా ఏకాదశీ పూజలు….
మాధవా… మళ్లించుకో నీవైపు మా మనసులు…!!శిఖి!!
ధర్మ పరిపాలనా రక్షకా…
ద్రౌపదీ మాన సంరక్షకా…
నారాయణా… నాననీ నా నాల్కపై నీ మూల మంత్రం…
లక్ష్మి నారాయణా… లక్ష్యమవనీ నీ దివ్య గానాల యాగం…
గోవింద గోవింద గోపాల బాల…
రాధామనోహరా గోపికాలోల…!! శిఖి!!
విశ్వమోహనాకారా మురళీధరా…
ద్వారకా నగరి దామోదరా…
పారిజాతములతో నిన్ను పూజింతురా…
దీప కాంతుల నడుమ దర్శింతురా…
గోవింద గోవింద గోపాల బాల…
దీవించవయ్యా ఆషాఢ ఏకాదశి వేళ..!!శిఖి!!
పాహిమాం…పాహిమాం..గోవర్ధన గిరి ధారి పాహిమాం…రక్ష మాం..రక్ష మాం…మధురా మురారి రక్ష మాం…