సిద్ధించు గణపతి…ఏ కార్యమైనా నిను కొలవగానే…

ఓం నమః శివాయ నమః

సిద్ధించు గణపతి…ఏ కార్యమైనా నిను కొలవగానే…
ఫలము లభియించు గణపతి… ఏక హారతినిచ్చి పూజించగానే….
లబ్దప్రతిష్టుడివి నీవు లంబోదరా…
వరములియ్యుటలో నీకు నీవే సాటి గౌరీ కుమార….!!సిద్దించు!!

గజముఖవదనా…సూక్ష్మ నయనారవిందా…
తప్పులను మన్నించు శ్రీ గణపతి…
మమ్ములను సుమనసుతో కరుణించు శుభ గణపతి..
కదలిరావయ్య కార్యములు ఆగకుండా సలుపగా…
జాగు తగదయ్య మా లోన ధైర్యమ్ము నిలుపగా…!!సిద్ధించు!!

తల్లి పార్వతీ మాత పసి హృదయమా…
శివుని మానస మందిర మహారాణి మమకారమా….
ఎంత ధన్యుడవు నీవు గణ నాయకా….
అర్ధ నారీశ్వరుని ఒడిన పెరిగిన శుభ దాయకా…
తెలుపరా…జగతికి పార్వతీ పరమేశ్వరుల అనురాగ మధురిమలని….
మాలోన పూయించరా అనురాగ బంధముల విలువలల విరికొమ్మనీ…!!సిద్ధించు!!

పాహిమాం…పాహిమాం… గణనాయకా పాహిమాం
రక్షమాం..రక్షమాం.. వరదాయకా రక్షమాం…

Leave a Comment

Scroll to Top