ఓం నమః శివాయ నమః
కమనీయమయ్యా శంకరా..కమనీయము
నీ నుదుటి పై చంద్రోదయం…రమణీయము
కన్నాము భక్తితో నీలాల నీ కనులను..
ఇక పండించరా శంకరా…చాన్నాళ్ళ మా కలలను…
జయమయ్య…జయ మయ్య జగ దీశ్వరా…
ఇక వరమియ్య జాగేల సోమేశ్వరా…!! కమ!!
కొండంత నమ్మకముతో వచ్చామయా….
గోరంత వరమిస్తె సరిపోవునయ్య..
సారించితే చాలు ఓసారి మా వైపు నీ దృష్టిని….
ప్రసరించితే చాలు నీ కరుణ కిరణాలు కాదనక మా మనవిని…
సాష్టాంగ పడి పోవునయ్య ఈ దేహము…
శివా…నీ అష్టోత్తరములు పలుకు ఈ మానసం…!! కమ!!
నా ఆర్తి నీకేటుల తెలుపగల పరమేశ్వరా…
నీ పైని భక్తి నేనెటుల చూపగల సర్వేశ్వరా…
సురాగమున పాడ గాయకుడను కాను….
పద కవితలు వ్రాయ పండితుడను కాను…
ఒక క్షణము మనసారా కనులు మూసుకొని ప్రార్థించగల దిట్టను…
ఆ క్షణములో కరుణించితే చాలు నిను మరుజన్మ కోరను….!! కమ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం
రక్షమాం…రక్షమాం….సర్వేశ్