ప్రతి దినమొక శుభ దినము…

ఓం నమః శివాయ నమః 

ప్రతి దినమొక శుభ దినము…
నిను కనగా శివ..మాకిది వరము..
నీవిచ్చే ఈ దర్శనము..
కలిసొచ్చిన కోరని భాగ్యము..
శంభో శంకర మహాదేవా…
ఈ ఫలమెప్పటిదని విన శలవీవా…!!ప్రతి!!

నే పలికే మాట నీదవనీ…
నే నడిచే బాట నీదవనీ…
నేను నాదను భావము నాలో పోనీ..
మనది మన అందరిదను భావము నాలో కలగనీ….
కనగలనివ్వు ప్రతి హృదయాన….
నువ్వున్నటుల దివి కైలాసాన…!!ప్రతి!!

ఒకటే మంత్రము…ఒకటే ధ్యానము…
పంచాక్షరి మంత్రము…పద పంచామృతము…
ఎపుడని అడగము… ఎచటని వెతకము…
కరుణిస్తే చాలని పూజలు చేతుము…
ఇక నీదే భారము శంకరా…
మాకిక ఆధారము నీవే శంకరా….!!ప్రతి!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...పాహిమాం
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top