ఎవరికిచ్చావు శంకరా…వరమును..

ఓం నమః శివాయ నమః 

ఎవరికిచ్చావు శంకరా…వరమును..
కాళలింగమున అచ్చుగుద్దినట్లు తీర్చ నీ నిజరూపమును..
ధన్యుడయా అతడు శివశంకరా…
కారణ జన్ముడయా అతడు పరమేశ్వరా…!!ఎవరి!!

రవి వారమను భావమును కలిగించు తీరున…
నీ నుదుటి పై భానునిగ తిలకములద్దీ…
నీ ఆజ్ఞచే ఉదయించు చున్నట్లు తెలిపే ప్రభాకరుని కిరణాలు గా సోగసులద్దీ…
ప్రేమతో పిలుచుచున్నట్లున్న నీ కరుణ కనులను…
వరములిచ్చెందుకు  వేచివున్నట్లు ఆ మోము రూపును…!!ఎవరి!!

నిను తలచుకుంటూ మలిచాడు శంకరా ఆ ధన్యుడు…
మనసార కోలుచుకుంటూ రూపు దిద్దాడు శంకరా.. ఆ కళాకారుడు..
ఇంతకన్నా భాగ్యముండునా తనకి…
“దీర్గాయుష్మాన్ భవా”  అన్న దీవెనలు ఇవ్వరా అతనికి…!!ఎవరి!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top