ఓం నమః శివాయ నమః
ఎందుకిక..నాకెందుకిక శివ శంకరా ఏ వరములు…
పొందికగా లయబద్ధముగ వ్రాయిస్తువుంటే నీ పదములు ..
కదలిపోతూ కలమువ్రాసే అక్షరాలివి కావురా…
నీ కరుణ పొంది ప్రతి దినము వ్రాసే పూజాక్షతలివి శివ శంకరా…!!ఎందు!!
చేరనీ చరణాల చెంతకు ఈ భక్తి గీతిక సుమమును ..
నీ పదము తగిలి విరియుచుంటే నను కాననీ నీ ప్రభలను…
రోజుకొకటీ వ్రాసినా నా తనివి తీరదు శంకరా…
శత కోటి కవితలు వ్రాసినా అవి తక్కువే శివశంకర…!!ఎందు!!
ఎవరికెపుడు వరము నిత్తువో తెలియదాయేను శంకరా….
ఏ శుభ ఘడియలోన కరుణ చూపి పలకరింతువో ఎరుగమాయెను హర హరా..
అయిననూ విడమయ్య విడము నీదు పాదాలు..
కలనైన మమ్ము కరుణించితే మా జన్మ ధన్యాలు…!!ఎందు!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…