ఓం నమః శివాయ నమః
తేజోమయం…నీ దివ్య రూపం..
అరుణోదయం…పున: దర్శనీయ భాగ్యం…
మృత్యుంజయయా…నిను కనగ వరమిచ్చినావా…
దిగంబరాయ.. దీవించ దివి నుండి దిగి వచ్చినావా…
శరణు శరణు అంటూ వేడేము శంకరా…
నీ చరణాలు దిక్కంటూ వాలేము శుభకర…!!తేజో!!
మంత్రముగ్ధులవుదురయా నిను కనిన వెంటనే…
ఆసు కవులవుదురయా…నీ సౌందర్యము కనినంతనే…
వ్రాయాలనిపించేవు సామాన్యుడైనా నీ సౌందర్య లహరిని…
పాడాలనిపించేవు పామరుడైనా నీ గాన లహారిని…!!తేజో!!
సుమ సౌరభల వీచికలు నిను తాకినపుడు….
అవి నీ హృదయారవిందమును స్ప్రశియించి నపుడు..
కంటిమయ్యా కరుణ వెన్నెలలు నీ కనులలో…
మొక్కొంటిమయ్య ప్రసరించమని మా ఇంటి గడపలలో..
విరియనీ ప్రతి ఇల్లు కైలాస శిఖరాల సిరి వెన్నెలై…
అవి మారనీ పరమేశ్వరా…సత్వరము నీ వున్న కోవెలై ..!!తేజో!!