ఓం నమః శివాయ నమః
ఎవరికైనా వరమునిచ్చే నీ అభిమతము ఉన్నతమురా శంకరా…
ఏ ప్రాణికైన కరుణ నొసగే నీ మనసు మహోన్నతమురా ఈశ్వరా…
కరుణ జలనిధులున్న నీ మనసు సరసులోన….
నీ పద పూజ కలువనై వికసించి ధన్యమవనా…
శంభో హరా శంకరా… హర హరా..గౌరీ సమేత శశిధరా…
ఈశా…ప్రభో శంకరా…శివ శివా.. మహేశా సదా కావరా…!!ఎవరి!!
నందిలా కూచుండి పోయి ఎదురు చూతును శంకరా…
ఆనతిస్తే సేవించ నిన్ను వేచి వుందును నీ ముందర…
రెప్ప వాల్చక చూచుచుంటా ఎప్పుడిత్తువని ఆజ్ఞని..
రెప్పపాటున నెరవేర్చి ఆజ్ఞను ధన్యుడువుతును నేనని…
ఈ తనువు నీది…అణువణువు నీది…నాది అన్నది లేదురా…
ఏ తల్లి కడుపున పుట్టినా అవి ఎవరి స్వంతమూ కావురా…!!ఎవరి!!
ఒక పువ్వునో..ఒక కాయనో..ఒక రెమ్మనో జన్మించినైతిని…
నీ పూజకో..నీ సేవకో చరణాల చెంతకు చేరనైతిని…
మాట లేని, మనసు లేని ఫలము పుష్పము ధన్యమయ్యా…
మాట వినని మనసు వినని ఈ మనిషి జన్మము ఎందుకయ్యా…
వింత కదరా శంకరా…నీ ఆటలో ఈ మనుషులు…
ఎంత తరచీ చూసినా కనిపించనియ్యవు కదా నీ మాయలోని లొసుగులు…!!ఎవరి!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…