ఓం నమః శివాయ నమః
కార్తీక మాసం…నీ కరుణ కోసం..
కదలి వచ్చారమ్మ జనము కాత్యాయిని…
దీపాలు వెలిగించి ప్రార్థించవచ్చారమ్మా దాక్షాయణి…
దయచూడవమ్మ హిమగిరిపురి దయామయీ..
కాస్త కరుణ చూపమ్మ…కైలాస శిఖరాల కరుణామయి…!!కార్తీ!!
నీ అరమోడ్పు కనులలో దాగి వున్నాయమ్మ…
అన్నార్తులను ఆదుకొన ప్రేమ నిధులు….
నీ బిడ్డలను కావ విరిసి వున్నాయమ్మా…
నీ కనుల కొలనులో
కరుణ కలువ పూలు…
పంచామృత పరిమళభరితమైన నీ ప్రేమకి…
దాహార్తులము కామా తల్లీ ఆ దివ్యానుభూతికి…!!కార్తీక!!
శంకరా ..కానరా మా అమ్మోరినీ..
దివ్య సొగసులతో అలారారు మా బంగారు తల్లిని…
చేర రావయ్యా వెంటనే తన చెంతకి…
చేరి వరములియ్యంగ ప్రేమతో ప్రతి ఒకరికి….
మరతురా ఎవరైన నీ పాద పద్మాలనీ..
భక్తితో మొక్కుతూ వుంచరా…నీ చరణాల కాసిన్ని కుసుమాలని!!కార్తీక!!
పాహిమాం…పాహిమాం…పార్వతీ సుందరేశ పాహిమాం
రక్షమాం…రక్షమాం..మంగళ గౌరీ రక్ష మాం….