కంటిమయ్యా శంకరా…

 ఓం నమః శివాయ నమః 

కంటిమయ్యా శంకరా…
మాధవుని మా కనులతో…
మొక్కొంటిమయ్యా హర హరా..
ముదమార నిను మా మనసుతో…
ఏమి భాగ్యమిదేమి భాగ్యము…
మిము కనినట్టి ప్రతి జన్మ ధన్యము!! కంటి!!

కేశవా…వదనారవిందా మమ్ము కావుము చల్లగా…
ఈశ్వరా… త్రినేత్ర నయనా దయను చూపుము తండ్రిగా….
మా రెండు కనులూ మీరుగా…
ఈ నిండు మనసుల సాక్షిగా…
వేడుకొందుము వేల్పులారా..పూలతో పూజంచుచూ ..
చేసెదము అభిషేకములు భక్తితో ధ్యానించుచూ..!!కంటి!!

పాల కడలిన శయన మూర్తీ శ్రీ లక్ష్మి సేవలు పొందుచూ…
మంచుకొండన ధ్యానమూర్తీ పార్వతిని మది తలచుచూ…
జంటగా జగములేలగ తరలి రండి ..
కలల పంటలై వరములియ్యగ కదలి రారండి…
కైలాసము వైకుంఠము ఇలకు తేరండి…
కరుణ చూపి స్వర్గధామపు దారి చూపండి…

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం.. శంఖు చక్ర గధాధర రక్షమాం…

Leave a Comment

Scroll to Top