ఓం నమః శివాయ నమః
శంభో మహాదేవ శివ శంకరా…
ఉజ్జయినీ పురాధీశ కాళేశ్వరా..
కంటిరా..ముక్కంటి కనులారా నిన్ను..
ఢమరుక నాదాలు మిన్నంటుంతుంటే నేను…
హర హర మహాదేవ శంభో శంకరా..
శివ శివ ప్రభోదేవ గౌరీ మనోహరా..!!శంభో!!
భక్త జన సముద్రపు “హర హర” ల హోరులో….
శక్తి కొలదీ చేయు కరతాళ ధ్వనుల తాళాలలో…
ఒళ్లంతా కళ్ళు చేసుకొని నిను కాన నీ ముందు నిలుచోని ఉంటే…
సాయం సంధ్య వేళ దివ్య మంగళ ధూప దీప హారతులు నీకిస్తువుంటే…
అల కైలాసమున నీవు పూజలందుకున్నట్లు ఉంది…
భువిని కైలాసము చేయ దివినుండి దిగి వచ్చినట్లుంది…!!శంభో!!
దీప కాంతులలో నీ మోము చూచు చుంటే…
ఎన్నడెరుగని ఆ వెలుగు తలచుకుంటుంటే…
తెలియని దివ్యానుభూతికి లోనయినాయి మా తనువులు…
తమకు తామే రాల్చాయి మా కనులు నీ పాదాలు కడగంగ జలములు…
ఈ అనుభూతినిట్లాగే కొనసాగనీ శంకరా ..
నీ లోకమే పరమావధిగా మనగలగనీ పరమేశ్వరా…!!శంభో!!
పాహిమాం….పాహిమాం..పరమేశ్వరా ..పాహిమాం….
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్ష మాం…..