ఓం నమః శివాయ నమః
లింగమును తిలకముగ కంటిరా…ముక్కంటి…
భక్తితో సంతసముగా మ్రొక్కొంటిరా..నీ పదమంటి….
ఈశ్వరా… శలవిస్తివా అర్చకులకి…
దిద్దమని లింగమును బొట్టుగా కనుబొమల మధ్యకి..
కొలుచుకొనమంటూ తనివితీరా కాత్యాయనీ పతినని…
వినూత్న రీతిని దర్శనంబిచ్చి పూజించు కొనుమంటూ భక్త జనులని…!!లింగ!!
ప్రయాస పడతావు పరమేశ్వరా….
పరి పరి విధములుగ దర్శనం బిచ్చి కరుణించాలని….
ఉబలాట పడతావు మాహేశ్వరా…
నిను దర్శించుకొని జనులందరూ ఊరటను చెందాలని…
నీ భక్తులమవవలెననిన చేసి ఉండాలి పుణ్యము….
నీ కరుణ పొందవలెననిన చేస్తూనే ఉండాలి నీ ధ్యానము….!!లింగ!!
అర్చకుల మునివేళ్ళకిచ్చావు దివ్య కళా నైపుణ్యము…
కాళ లింగమున నిను రోజుకొక రూపాన తీర్చిదిద్ది చేసుకొమ్మని జన్మ ధన్యము…
దర్శించుకొని పరవశించు నీ భక్తులను తిలకించి….
ఆ పౌరోహితులు పంచరా….ప్రసాదములను నీ కర్తలై దీవించి….!!లింగ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా.
నీ శిరము పై జాలువారే గంగ ధారలో చుక్కనైతే చాలురా….