కంటిమయా ముక్కంటి నీ మోములో….

ఓం నమః శివాయ నమః 

కంటిమయా ముక్కంటి నీ మోములో….
కరుణ రసామృత జల నిధులు
కోట్లలో…
కనుగొంటిమయా శంకరా…నీ కనులలో….
వరమియ్య మాకు.. ఎదురు చూస్తున్నట్లున్న చిహ్నాలు నీ చూపులో ..
ఇంతకంటే ఏముంది శంకరా….నిన్నడగ వరము….
ఇది చాలునాయ్యా .. ఇంకేల మాకు మరుజన్మము…!!కంటి!!

కనులు రాల్చే నీరు గంగా జలములవును నిను గాంచు తరుణాన….
మనసు పలికే పలుకు నీ తోలికీర్తనల పదమవును నిను ప్రార్థించు సమయాన….
క్షణములో నీ మదిని మా అంతరాత్మ తాకునేమో….
అందుకే ఆ క్షణములో మేమేవరమో  మాకు గురుతురాదేమో…!!కంటి!!

ఎందు కవుతావో తెలియదు మాకింత ప్రాణం….
నిత్యమూ చేయాలనిపించేంతగా నీ నామ పఠనం….
ఎపుడు కరుణిస్తవో తెలియదు మాకివ్వ వరం…
కొనసాగిస్తాననంటుంది నా మనసు నీ నామ ధ్యానం …
నిను ధ్యానించు టే వరమని భావింతు మయ్యా…
నిను స్మరియించుటె పరమార్థమని పూజింతుమయ్య…!!కంటి!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...
నీ కరుణ పొందని జన్మ ఎక్కడుందయా సర్వేశ్వరా…

Leave a Comment

Scroll to Top