రవిబింబమే నీ నుదుట తిలకమై…

ఓం నమః శివాయ నమః 

రవిబింబమే నీ నుదుట తిలకమై…
కరుణించు నీ చూపులే శుభయోగమై….
తెలవారనీ శంకరా…ప్రతి ఉదయము…..
ప్రణమిల్లనీ నీ ముందు మా హృదయము…!!రవి!!

ఆరారు కాలాలు అలరారునట్లుగా…
మా బంగారు కలలన్ని నిజమవ్వు నట్లుగా…
పయనించనీ శంకరా…ఈ జగము మును ముందుకు….
మా….చేపట్టి నడిపించ ఎన్నటికి మరువకు….
కలడు శివుడు మా తోడంటూ జనులు మురిసి పోవాలి….
వలదు…వలదన్నా వర్షించు నీ వరాల విరి వానలలో తడిసి పోవాలి….!!రవి!!

ఆకాశమే హద్దుగా మాలోని భక్తి మానుగా ఎదగని..  
మా ఊపిరిని సాంబ్రాణి ధూపముగ చేసి నను హారతినివ్వనీ….
ఎవరు కననట్టి నీ దివ్య ప్రపంచమును నను గాంచనీ శంకరా…
వేరెవరు అననట్టి ఓంకార నాదాల స్వర జతులనననివ్వరా శశిధరా…
తాళమేస్తూ శృతి లయల జత కలపవయ్య….
ఆలకిస్తూ…నా మదిన నర్తించవయ్య…!!రవి!!

పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా పాహిమాం….
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top