ఓం నమః శివాయ నమః
కనరారా….అమ్మని…
ఈ జగమేలు జననిని…
వేడుకొన రారా…. దుర్గని…
కరుణించమని అవనిని…
ముచ్చట కొలుపు ముగురమ్మల మూలపుటమ్మని…
మూర పూలకే వరాల మూట లిచ్చేటి మన అమ్మ కనకదుర్గమ్మని…!!కనరారా!!
ఆ తల్లి చిరునవ్వులో ఉదయించు ఎన్ని పున్నములో…
తిలకించు ప్రతి మదిలోన విరియు ఎన్ని వెన్నెలలో….
ఎదుట నిలిచిన చాలు పలుకు మన గొంతు వేల స్తోత్రములు….
ప్రేమ కనుల తల్లికి వినిపించ భక్తితో దివ్య మంత్రములు…!!కనరారా!!
ప్రార్థింతుము పశుపతిని కనరమ్మంటూ మన తల్లిని….
జత కూడి దీవించ కోరేము
మనసైన కైలాస గిరి మరుమల్లి మల్లన్నని….
దీవించితే చాలు మనని ఆ ఆది దంపతులు….
శివపార్వతుల దయ లేకున్న మనకు ఎన్నుంటే ఏమి కోట్ల సంపదలు….!!కనరారా!!
పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…