ఓం నమః శివాయ నమః
జంగమా…మా హృదయాన వెలుగు దీపమా…
లింగమా…కరుణించ ఇల వెలసిన దైవమా ..
వేడుకొన వచ్చాము నారికేళ ఫల పుష్పములతో నాగేశ్వర…
నిను కొలుచుకొన వచ్చాము వండుకొని పాల పొంగళ్ళతో పరమేశ్వరా ..
ఓం నమః శివాయ శివశంకర…
దీవించరా మమ్ము గంగాధర…!!జంగమా!!
వేస్తుంటే ఒక్కొక్క అడుగు నీ గుడి లోనికి….
మేము అనుకుంటూ “శివ శివా” అని కదులుతూ మును ముందుకి…
క్షణమొక్క యుగమైనట్లు ఉంటుంది శివ శంకరా…
నిను దర్శించు క్షణముకై… మనసు విలపించుచున్నట్లు ఉంటుంది శంభో హరా…!! జంగమా!!
దరి చేరి నిను దర్శించుకొను సమయాన….
భక్తి భావోద్వేగముతో మది మూగదౌను ఆ క్షణాన….
విన్నపములను విన్నవించకనే కదిలి వచ్చేము…
మా బాధలను నీతోటి పంచుకొనకనే బయటకొచ్చేము…
చదివి ఉంటావు… కనురెప్పపాటులో నీ ఎదుట నిలిచినపుడు మా మనసుని…
తగిన ఓదార్పు నిచ్చి ఉంటావు…గుండె బరువుతో కనుల నీరునిలిచుండగా… శంకరుడు ఉన్నాడు కలత వలదని…!! జంగమా!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…