ఓం నమః శివాయ నమః
శంకరా…. ఉజ్జయినీ కాళేశ్వర….
ఈశ్వరా… శిప్రా నదీ తీర నగరేశ్వరా..
ఎంతో భక్తితో కొలవాలనిపించుదువు నీవు…
ఇంకెంతో ఆర్తితో
కీర్తించాలనిపించుదువు నీవు..
ఏముండునో ఏమో నీ మోములో…
నిను కనగనే… పలుకు ఓంకార
నాదములు మాలో…!!శంకరా!!
శంకరా.. నీ మోము కేసి చూస్తున్న కొలదీ…
పొంగేనయా మాలోన పుణ్యాల జలధి …
నిను వీక్షించ ఇస్తేను చాలయా క్షణ కాల వ్యవధి….
తుదకు… నిముషమైనా ఉండిపో వాలనిపించునది నీ దివ్య సన్నిధి…
మనసు ఉత్తేజితమై వెలిగి పోవు…
పిదప…కరుణించినావని తెలిసి నీ చరణాల వాలిపోవు…!!శంకరా!!
మకరంద మొలికించు మందార కుసుమాల సుమ భూషణా…
మల్లె సంపంగుల విరిమాలలు నీకు ఎన్నెన్ని వేసినా….
నీ దివ్య సౌందర్యము ముందు అవి చిన్నబోవును కదా శివన్నా…
మహోన్నతమైన సహజ సౌందర్య మంగళ రూపమునకు సొగసులద్ద మా తరమా చెప్పవన్నా..
మనసు తానెప్పుడూ అంటూవుంటుంది…నేనెప్పుడూ ఉండేది మీలోని పరమాత్మతోనని..
అందుకే శంకరా…అనగలము మేమెప్పుడూ కనగలిగినది మా అంతరాత్మతో నిన్నని…
!!శంకరా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా.