తరియించినావుగా హనుమా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

తరియించినావుగా హనుమా…
స్వామి భక్తి పరాయణ వానర సార్వభౌమా..
కాళలింగముపై ఆవహించ కాళేశ్వరుని మది గెలిచిన వైనమెటులనో చెప్పుమా…
శ్రీరామ.. జయరామ..జయ జయ రామా…
అని పరితపించు అంజనీసుతా…నీవు గాక వేరెవరు తెలుపుమా…!!తరియించి!!

మోదమయ్యావు పరమేశ్వరునికి…
పిలిపించుకున్నాడు తన గర్భగుడిలోనికి…
దగ్గరయ్యావు భక్తితో తన మనసు తీరానికి..
జరిపించినాడు తన పూజ్యాభిషేకాలు నీ దివ్యరూపానికి

sarveswaruni krupanu pondina hanumantudaa
Bhaktudivai bhagavantudivaina gunavantudaa

…!!తరియించినావు!!

నిరుపమానమైన భక్తికి నిటలాక్షుడైనా కరిగి పోతాడనీ…
అసమానమైన సేవా నిరతికి శ్రీమన్నారాయణుడైనా లొంగి పోతాడనీ..
ఇంతకన్నా నిదర్శనము ఏముంది హనుమా…
భావి తరాలకు నీ ఘనచరితను సోదాహరణముగ తెలుపమా…!!తరియించినావు!!

పాహిమామ్..పాహిమాం.. అంజనీసుత రూప ఆదిశంకరా పాహిమాం…
రక్షమామ్..రక్షమామ్..శ్రీరామ దూత  రూపాయ శివశంకరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top