ఒకే ఒక్క దేవుడండి…వక్రతుండుడు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఒకే ఒక్క దేవుడండి…వక్రతుండుడు…
సిద్ధి గణనాధుడు ఒక్కడే పూజాగ్రజుండుడు..
పార్వతీ పశుపతుల ముద్దు తనయుడు…
కార్తికేయునికి సోదరుడై మురిసినోడు..
జయ గణేశ.. జయగణేశ..జై జై వినాయకా…
జయ గణేశ.. జయగణేశ..సిద్ది బుద్ది వినాయకా..!!ఒకే!!

నీ భుక్తాయసము చూసి పరిహసించి పొందినాడు జాబిల్లి నీ తల్లిచేత  శాపము…
తనని చూసినోళ్ళకెవ్వరికీ తప్పవనీ నీలాపనిందలు…
ప్రణమిల్లి వేడుకునె సురలోకము  చంద్రునికి తొలగించమనీ  పాపము..
 సవరించె హైమావతి చవితి నాడు మాత్రము తప్పవని  ఆ శాపఫలములు..
జయగణేశ..జయగణేశ…జై జై వినాయకా…
జయ గణేశ.. జయగణేశ…సిద్ధి బుద్ధి వినాయకా…
!!ఒకే!!

తలిదండ్రుల ప్రేమ పొంది ధన్యమైన నీవు…
మాతా పిత సేవలోని మాధుర్యమును చాటినావు…
చేయకుంటే ఎట్లయా నీదు చవితి పూజలు…
తెలియచెప్పకుంటే తప్పయా..నీదు కీర్తి చరితలు…
జయ గణేశ… జయగణేశ…జై జై వినాయకా…
జయ గణేశ.. జయగణేశ..సిద్ది బుద్ది వినాయకా…!!ఒకే!!

పాహిమామ్..పాహిమామ్..పార్వతీపరమేశ్వర  తనయా…
రక్షమామ్..రక్షమామ్..సుబ్రమణ్యేశ్వర సోదరా…

Leave a Comment

Scroll to Top