ఓమ్ నమ:శ్శివాయ నమ:


శంభో శంకర మహాదేవ..
సాంబసదా శివ గురుదేవ…
ప్రతిక్షణమూ పలికే వరమీవా…
ఆ తలపులలో మము మననీవా..
మా జీవన నాడివి నీవైతే…
అది పలికే నాదము నీదైతే..
అది ఎంతో ఎంతో పుణ్యఫలం..
మేమేనాడో నోచిన నోము ఫలం..
శంభో శంకర మహాదేవ…సాంబసదా శివ గురుదేవ…..
రోజొక వ్రతముగ నీ పూజలు మేము చేసుకొని…
మా మదిలో దైవముగ నిన్నే నింపుకొని…
అడుగే ముందుకు వేస్తుంటే…
మా వెనకే నువ్వు వున్నట్లుంటే…
అది వరమే కాదా శంకరా…
మా కల తీరిన క్షణమే కాదా హర హరా..
శంభో శంకర మహాదేవ..సాంబసదా శివ గురుదేవ..
కనిపించని దైవం నీవయ్య…
మా తెలియని ధైర్యం నీవయ్య…
వినిపించని పిలుపే నీదయ్య..
కనిపెట్టుకొని తిరిగే తండ్రివయా…
పాపం, పుణ్యం చూడవయా…
శుభదీవెనలిస్తూ, ఇస్తూ సాగేవయ్య..
శంభో శంకర మహాదేవ…సాంబసదా శివ గురుదేవ….
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా.. రక్షమాం..