వచ్చానయా శంకరా..నీ మందిరానికి…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

వచ్చానయా శంకరా..నీ మందిరానికి…
తెచ్చానయా పువ్వులు పూజించటానికి…
ఇస్తే చాలునయా క్షణము నీ దర్శనానికి..
అనుమతిస్తే చాలునయా సేవ చేయటానికి..!!వచ్చానయా!!

కోటానుకోట్ల సుంగంధాలను పంచేటి పూలబాలలు…
కలలు కంటాయి అవ్వాలని నీ మెడలోకి మాలలు..
తమకు తాము చేరలేక నీ చెంతకు ఆ లేత సుమములు…
మమ్ము వారధిగా చేసుకొని తీర్చుంటాయి ఎన్నో ఏళ్ళ తపములు…
ఆ ఆరాటమును తలచుకొని,తలచుకొని మూగదాయె మనసు…
జన్మచరితార్థమును తెలియజెప్పిన సుమబాలలకివ్వరా నూరేళ్ళ ఆయుషు..!!వచ్చానయా!!

భక్తి పూలవనములోన నేను కూడ పువ్వునై…
చేరిపోతే చాలురా నీ పాదాలచెంత…
నీ సేవ చేయుక్షణములోన శుద్ధగంగ జలమునై…
ధారనైతే చాలురా జాలువార నీ శిరముపైన  కొంత…
వరములిచ్చు వరదాయకా ఆలకించరా…
వరము తీర్చ వల్ల కాదు కాదని చెప్పబోకురా…!!వచ్చానయా!!

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమాం…
రక్షమామ్..రక్షమాం..సర్వేశ్వరా... రక్షమాం..

Leave a Comment

Scroll to Top