ఒకే ఒక్క కోరిక…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఒకే ఒక్క కోరిక…
తీర్చరా..కైలాస సామ్రాజ్య పరిపాలకా…
విడమరచి చెప్పుకోవాలనుంది నీతోన నా వేదనంతా…
సుమమునై చేరి సేదతీరాలని వుంది నీ పాదాల చెంత…!!ఒకే!!

మా మనసులోతులలోకి వెళ్ళవయ్య…
చిమ్మచీకట్లు అనిపించు కానవయ్య..
వెలిగించు వారెవరు లేక గుండెలో నీదివ్య జ్యోతిని…
మబ్బులో మ్రగ్గింది ఇన్నాళ్ళు కానరా నీ మందిరాన్ని…
నీ చల్లని చూపులతో మది తలుపులను తాకరా మాహేశ్వరా..
నీ నవ్వులు వెన్నెలై సోకితే ఎద పులకించి పలుకదా నీ శ్లోకము పరమేశ్వరా…!!ఒకే!!

అనుకున్నదేది జరగడము లేదు…
జరగనున్నదేమీ తెలియడము లేదు..
ఆశే శ్వాసై బ్రతుకుతున్నాము….
నీ ధ్యాసే మరచి సాగుతున్నాము..
ఉనికిని చాటుతూ ఉరూరున దేవాలయాలలో నువ్వెలసివున్నా..
చుట్టపు చూపుగా వచ్చి దర్శించుకొనిపోయి నిను మరచు మా మనసులను మార్చవా శివన్నా…

పాహిమాం.. పాహిమాం..పరమేశ్వరా పాహిమాం

Leave a Comment

Scroll to Top