సారించకలా శంకరా…తీక్షణముగ నీ దృష్టిని…
కాపాడగలవారెవురురా ఈశ్వరా… కంపించిపోతే ఈ సృష్టిని..
పిచ్చుకపై బ్రహ్మస్త్రము చందాన నువ్వాగ్రహిస్తే…
మచ్చుకు అణువంత శిధిలమైనా మిగులునా కళ్ళేర్రజేస్తే…
చాలించరా శంకరా..నీ ఉగ్రరూపము..
ప్రసాదించరా జగదీశ్వరా..నీ ప్రేమ స్వరూపము..!!సారించకలా!!
ఏ జన్మలోనైనా తెలియక చేసివుంటే పాపము..
మన్నించవయ్యా..మాకు నువ్వంటే అపురూపము…
ఏ క్షణమునైనా ఏమరుపాటున చేసి వుంటే అపరాధము..
చెల్లింతుమయ్యా..శిరసావహిస్తూ ఏ తీరునైనా అపరాధరుసుము..!!సారించకలా!!
వివిధ ఫల పుష్ప మాలలతో నివేదించేము…
వినసొంపైన నీ భక్తి గీతాలను ఆలపించేము…
ప్రసున్నుడవై ప్రశాంతముగ నువ్వుంటే చాలురా శంకరా..
నీ చిరునవ్వుల నందనవనములు పూయించితే చాలు భవహరా..
పులకించిపోదా ఈ పుడమి నీ పాదాలపై బడి…
జగము మైమరచిపోదా నీ ధ్యాసలో పడి.. పడి..!! సారించకలా!!
పాహిమాం.. పాహిమాం.. శివశంకరా ..పాహిమాం..
రక్షమాం…రక్షమాం..అభయంకరా.. రక్షమాం..